- తెలంగాణ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు జూలూరు గౌరీశంకర్
యాదగిరిగుట్ట, వెలుగు: రాష్ట్రంలో బీసీ ఉద్యమాన్ని ఆపడం ఎవరి తరం కాదని రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యుడు, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ తెలిపారు. గురువారం యాదగిరిగుట్టలో ‘మన ఆలోచన సాధన సమితి’ వ్యవస్థాపక అధ్యక్షుడు కటకం నర్సింగరావు ఆధ్వర్యంలో 37 నియోజకవర్గాల బీసీ యువత, కుల సంఘాల నేతలతో జరిగిన బీసీ సంఘటిత శక్తి నిర్మాణ శిక్షణ శిబిరంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
బీసీ ఉద్యమాన్ని నిర్మాణాత్మకంగా, రాజ్యాధికార దిశగా ముందుకు నడిపించేందుకు బీసీలందరినీ ఒక్కతాటిపైకి తేవాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామన్న హామీని అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేసిందని మండిపడ్డారు. బీసీలంతా సంఘటితమై సమష్టి కార్యాచరణ రూపొందించుకుని ఉద్యమించాలని పిలుపునిచ్చారు
