విధులు బహిష్కరించిన గాంధీ జూడాలు

విధులు బహిష్కరించిన గాంధీ జూడాలు

మెడిసిన్ సీట్ల  భర్తీపై  కేంద్రం తీసుకొస్తున్న  నేషనల్ మెడికల్  కమిషన్ బిల్లును  వ్యతిరేకిస్తూ  రెండో రోజు నిరసన  కొనసాగుతోంది. గాంధీ  హాస్పిటల్ ముందు  నిరసనకు  దిగారు డాక్టర్లు. కేంద్ర సర్కార్ కు  వ్యతిరేకంగా నినాదాలు  చేస్తున్నారు. NMC బిల్లులోని   కొన్ని ప్రొవిజన్స్ కు   తాము వ్యతిరేకం  అంటున్నారు. సర్కార్  వెనక్కి తగ్గకుంటే  ఆందోళనను  ఉధృతం చేయాలని నిర్ణయించారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, బోధన ఆస్పత్రుల్లో ఎమర్జెన్సీ విధులను బహిష్కరించాలని జూనియర్‌ డాక్టర్లు నిర్ణయించారు. రాజ్యసభ ముందుకు NMC బిల్లు వచ్చిన సందర్భంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి విధులు బహిష్కరిస్తున్నట్లు జూనియర్‌ డాక్టర్లు ప్రకటించారు.