ధనిక రాష్ట్రంలో ఉద్యోగులకు వేతనాల్లేవ్ ఎందుకు... ప్రజలతో మద్యాన్ని తాగిపిస్తూ పాలన సాగిస్తున్నరు

ధనిక రాష్ట్రంలో ఉద్యోగులకు వేతనాల్లేవ్ ఎందుకు... ప్రజలతో మద్యాన్ని తాగిపిస్తూ పాలన సాగిస్తున్నరు

దళిత బంధు పథకం బోగస్ పథకం అని.... ఈటెల రాజేందర్ ను ఓడించేందుకే  సీఎం కేసీఆర్ ఈపథకాన్ని తెచ్చారని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన కోదండరాంపై అత్యంత‌ దారుణంగా పోలీసులతో దాడులు చేయించిన ఘనత కేసీఆర్ ది అని మండిపడ్డారు. ధనిక రాష్ట్రంలో ఉద్యోగులకు వేతనాలు, పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు, దళితులకు మూడెకరాల భూమి, నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వడం లేదని జూపల్లి ప్రశ్నించారు. ఏ పథకం అమలు చేసినా.. అది పూర్తి స్థాయిలో కేసీఆర్ అమలు చేయరని చెప్పారు.

రాష్ట్రాన్ని తాగుబోతుల రాష్ట్రంగా మార్చుతున్నారని జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఉమ్మడి రాష్ట్రంలో 8వేల కోట్ల రూపాయలు ఎక్సైజ్ శాఖకు ఆదాయం వస్తే.. ఇప్పుడు తెలంగాణలో 35వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందన్నారు. దీని బట్టి రాష్ట్రంలో ఎంత స్థాయిలో‌ మద్యం అమ్మకాలు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చని తెలిపారు. ధాన్యం కొనుగోలు పేరుతో ప్రభుత్వం రైతుల వద్ద పెద్ద ఎత్తున తరుగు తీస్తూ మిల్లర్లు, కాంట్రాక్టర్లుకు లబ్దిచేకూరుస్తోందని ఆరోపించారు.