మహిళా ఆఫీసర్లపై అసభ్య రాతలు ప్రమాదకరం : జస్టిస్‌‌‌‌ బి.సుదర్శన్‌‌‌‌ రెడ్డి

మహిళా ఆఫీసర్లపై అసభ్య రాతలు ప్రమాదకరం :  జస్టిస్‌‌‌‌ బి.సుదర్శన్‌‌‌‌ రెడ్డి
  •     జస్టిస్‌‌‌‌ బి.సుదర్శన్‌‌‌‌ రెడ్డి 

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛ అత్యంత విలువైనదని, కానీ, దానికి పరిమితులు ఉన్నాయని సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్‌‌‌‌ సుదర్శన్‌‌‌‌ రెడ్డి అన్నారు. ఇటీవల ఓ మహిళా ఐఏఎస్‌‌‌‌ అధికారి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేలా మీడియాలో ప్రసార మైన కథనాలను ఖండిస్తూ ఆయన మంగళవారం ప్రకటన విడుదల చేశారు. 

‘‘సోషల్‌‌‌‌ మీడియా, ప్రధాన మీడియా, ప్రచార సాధనాలు ఏవైనా సరే.. భావ ప్రకటన స్వేచ్ఛను దుర్వినియోగం చేయ డానికి వీల్లేదు. ఓ యువ ఐఏఎస్‌‌‌‌ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా వార్తలు రాయడం అత్యంత దారుణం” అని ప్రకటనలో పేర్కొన్నారు.