ఫలించిన పోరాటం… సింధూ ఒడికి చిన్న పాప

ఫలించిన పోరాటం… సింధూ ఒడికి చిన్న పాప

సింధూశర్మ పోరాటం చివరికి ఫలించింది. ఆమె చిన్నపాపను రిటైర్డ్ జడ్జి నూతి రామ్మోహన్ రావు కుటుంబం ఆమెకు అప్పగించింది. అయితే పెద్ద పాపను కూడా తనకు అప్పగించాలని సింధూ డిమాండ్ చేస్తున్నా, రామ్మోహన్ కుటుంబం అందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. పెద్ద పాపను చూడటానికి నూతి కుటుంబం నిరాకరిస్తున్నారని, చివరికి పెద్ద పాపను తనకు ఒకే ఒక నిమిషం చూపించి తీసేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తోంది. తమను బెదిరించడానికి ప్రయత్నిస్తున్నారని, తమ శరతులకు ఒప్పుకుంటేనే తమ బిడ్డను ఇస్తారని అంటున్నారని తెలిపింది. పెద్ద పాపను తనకు అప్పగించకపోతే తాను కోర్టుకు వెళ్తానని సింధు తెలిపింది.

అయితే పెద్ద పాపను సింధుకు అప్పగించే విషయంలో చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. సోమవారం తనను భరసో సెంటర్‌ కు పిలిచారని, అక్కడే అప్పగించాలా వద్దా అనేది నిర్ణయిస్తారని సమాచారం. తన పసిపాపను తనకే అప్పగించాలని డిమాండ్ చేస్తూ ఐదు గంటల నుంచి సింధూ శర్మ మహిళా సంఘాలతో కలిసి రిటైర్డ్ జడ్జి నూతి రామ్మోహన్ రావు ఇంటి ముందు ఆందోళన నిర్వహించాయి. ఎంతకీ రామ్మోహన్ కుటుంబం ఒప్పుకోకపోవడంతో చివరికి ప్రభుత్వం స్పందించిన వెంటనే చైల్డ్‌ లైన్ ప్రతినిధులు వచ్చి సింధూశర్మను ఇంట్లోకి తీసుకెళ్లారు.