V6 News

జస్టిన్ లాంగర్ అనూహ్య నిర్ణయం

జస్టిన్ లాంగర్ అనూహ్య నిర్ణయం

కాన్బెర్రా: ఆస్ట్రేలియా పురుషుల క్రికెట్ జట్టు కోచ్ జస్టిన్ లాంగర్ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. తనకెంతో ఇష్టమైన హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు లాంగర్ శనివారం ప్రకటించాడు. క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ)తో అనేక చర్చల అనంతరం.. జస్టిన్‌ లాంగర్‌ తన పదవి నుంచి వైదొలిగినట్లు అతడి మేనేజ్‌మెంట్‌ కంపెనీ డీఎస్‌ఈజీ శనివారం ప్రకటన విడుదల చేసింది. టీమ్ కు తాత్కాలిక హెడ్ కోచ్ గా ఆండ్రూ  మెక్ డొనాల్డ్ ను నియమిస్తున్నట్లు ఆసీస్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. టీ20 వరల్డ్ కప్, యాషెస్ సిరీస్ గెలిచి కంగారూ జట్టు జోరు మీదున్న సమయంలో లాంగర్ ఈ నిర్ణయం తీసుకోవడం అనూహ్యమనే చెప్పాలి. అయితే ఆటగాళ్లతో విభేదాలు తారస్థాయికి చేరడంతోనే అతడు కోచ్ పదవికి గుడ్ బై చెప్పాల్సి వచ్చిందని తెలుస్తోంది. 

ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ టిమ్‌ పైన్‌, ప్రస్తుత టెస్టు కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌, పరిమిత ఓవర్ల క్రికెట్‌ కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ సహా పలువురు కీలక ఆటగాళ్లతో లాంగర్‌కు అభిప్రాయ భేదాలు తలెత్తినట్లు సమాచారం. ఆగస్టులో బంగ్లాదేశ్‌ పర్యటనలో ఆస్ట్రేలియాకు ఓటమి ఎదురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆటగాళ్లతో లాంగర్ కు విభేదాలు తారస్థాయికి చేరినట్లు తెలుస్తోంది. అనవసర విషయాల్లో జోక్యం చేసుకుంటాడని, అంతా తాను చెప్పినట్లే జరగాలనే నియంతృత్వ ధోరణితో ఉంటాడని ప్లేయర్స్ అతడి వ్యవహారశైలిపై మండిపడినట్లు సమాచారం. ఆయనతో తమకు పొసగడం లేదంటూ కోచ్‌కు వ్యతిరేకంగా గళం విప్పడంతో లాంగర్ ను కొనసాగించేందుకు ఆసీస్ బోర్డు విముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తల కోసం:

విశ్లేషణ: శూద్రులు నిలబెడుతున్న.. రామానుజ కీర్తి

సీఎం దత్తత పట్టణంలో చిత్ర విచిత్రాలు

చనిపోయిన వ్యక్తికి వ్యాక్సిన్​ వేశారట!