చనిపోయిన వ్యక్తికి వ్యాక్సిన్​ వేశారట!

చనిపోయిన వ్యక్తికి వ్యాక్సిన్​ వేశారట!
  • మెసేజ్​ పంపించిన హెల్త్​ డిపార్ట్​మెంట్​
  • అవాక్కయిన మృతుడి కుటుంబ సభ్యులు 
  • ఆసిఫాబాద్​లో ఆరోగ్య శాఖ వింత 

ఆసిఫాబాద్, వెలుగు: వ్యాక్సినేషన్ ​విషయంలో హెల్త్​ డిపార్ట్​మెంట్ వింతలు చేస్తోంది. చనిపోయిన వాళ్లకు కూడా వ్యాక్సిన్ ​ఇచ్చినట్టు చెప్తోంది. ఈ ఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో జరిగింది. ఆసిఫాబాద్ కు చెందిన వాసుదేవన నాగేంద్రయ్య గత ఏడాది మే 1న కరోనాతో ఆసిఫాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్ లో చనిపోయాడు. సీరియస్​గా ఉన్నా పట్టించుకోకపోవడం వల్లే  నాగేంద్రయ్య చనిపోయాడని అప్పట్లో కుటుంబసభ్యులు గొడవ కూడా చేశారు. అయితే నాగేంద్రయ్యకు గత నెల 30న సెకండ్ డోస్ వాక్సిన్​ వేసినట్టు హెల్త్ డిపార్ట్​మెంట్​ మెసేజ్​ పంపించింది. చనిపోవడానికి పదిహేను రోజుల ముందే నాగేంద్రయ్య ఫస్ట్​ డోస్ ​తీసుకున్నాడు. అయితే చనిపోయిన 9 నెలల తర్వాత సెకండ్ డోస్ వేసినట్టు మెసేజ్ ​పంపించడంతో కుటుంబసభ్యులు అవాక్కయ్యారు. బతికి ఉన్నప్పుడు సరైన ట్రీట్​మెంట్ ఇవ్వకుండా చంపేశారని, చనిపోయాక వ్యాక్సిన్​ ఇచ్చినట్టు చెబుతున్నారని వాపోయారు.