గురుకుల, మోడల్ టీచర్లకూ హెల్త్ కార్డులివ్వాలి..సీఎం రేవంత్ రెడ్డిని కోరిన ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి

గురుకుల, మోడల్ టీచర్లకూ హెల్త్ కార్డులివ్వాలి..సీఎం రేవంత్ రెడ్డిని కోరిన ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని గురుకుల, మోడల్ స్కూల్, కేజీబీవీ టీచర్లకూ హెల్త్ కార్డులు మంజూరు చేయాలని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పుల్గం దామోదర్ రెడ్డి, భిక్షంగౌడ్‌‌‌‌తో పాటు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు హెల్త్ కార్డులు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ అర్హత తప్పనిసరి అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో, ఇతర రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణలోనూ టెట్ అర్హత మార్కులను తగ్గించాలని సీఎంకు శ్రీపాల్ రెడ్డి విన్నవించారు. దీనిపై సీఎం తక్షణమే స్పందిస్తూ.. ఈ విషయంపై పూర్తిస్థాయి నివేదిక తెప్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.