సొంత రాష్ట్రానికి కొత్త ఏవియేషన్ మంత్రి గుడ్‌ న్యూస్

సొంత రాష్ట్రానికి కొత్త ఏవియేషన్ మంత్రి గుడ్‌ న్యూస్

న్యూఢిల్లీ: ఇటీవలే కేంద్ర కేబినెట్ విస్తరణ సందర్భంగా మంత్రి పదవి దక్కించకున్న జ్యోతిరాదిత్య సింధియా తన సొంత రాష్ట్రం మధ్యప్రదేశ్‌కు గుడ్‌ న్యూస్ చెప్పారు. కేంద్ర సివిల్ ఏవియేషన్ శాఖ మంత్రి పదవి పొందిన ఆయన తన రాష్ట్రం నుంచి కొత్తగా మరో ఎనిమిది ఫ్లైట్స్ ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్, జబల్పూర్‌‌లను కనెక్ట్ చేస్తూ ముంబై, పుణె, సూరత్‌లకు ఈ విమాన సర్వీసులు నడుస్తాయన్నారు. ఉడాన్ స్కీమ్‌లో భాగంగా జులై 16 నుంచి వీటి సర్వీసులు మొదలు పెట్టబోతున్నట్లు సింధియా ట్వీట్ చేశారు. గ్వాలియర్ – ముంబై – గ్వాలియర్, గ్వాలియర్ – పుణె – గ్వాలియర్, జబల్పూర్ – సూరత్ – జబల్పూర్, అహ్మదాబాద్ – గ్వాలియర్ – అహ్మదాబాద్ రూట్లలో స్పైట్ జెట్‌ తన ఫ్లైట్స్ నడుపుతుందని తెలిపారు. పెద్ద సిటీలతో పాటు చిన్న నగరాలకూ ఎయిర్ కనెక్టివిటీ పెంచేందుకు ప్రారంభించిన యుడాన్ స్కీమ్‌ను మరింత ముందుకు తీసుకెళ్తామని చెప్పారు.