పంజాగుట్ట, వెలుగు: తెలంగాణ మలి దశ ఉద్యమంలో ప్రతి బిడ్డ తనదైన రీతిలో పాల్గొన్నారని, వీరంతా ఉద్యమకారులేనని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ కేశవరావు (కేకే) స్పష్టం చేశారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ ఉద్యమ కారుల సమాఖ్య కన్వీనర్ కరుణాకర్ దేశాయి అధ్యక్షతన ఉద్యమ సంఘాల ప్రతినిధులు, రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నేతల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా కేకే హాజరై మాట్లాడారు. ఉద్యమకారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు.
సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి మాట్లాడుతూ.. కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో ఇచ్చిన 250 గజాల ఇంటి స్థలం, సంక్షేమ బోర్డు హామీలను విస్మరించడం విచారకరమని, హక్కుల కోసం ఉద్యమకారులు బలంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గంగాపురం వెంకటరెడ్డి, చెరుకు సుధాకర్, ప్రపుల్ రెడ్డి, జానకి రెడ్డి, రఫీ పలువురు ఉద్యమ నేతలు పాల్గొన్నారు.
