- అప్పుడే దేశాభివృద్ధి: కేటీఆర్
మెహిదీపట్నం, వెలుగు: ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని మార్చగలిగే శక్తివంతమైన సాధనం ఓటు హక్కు మాత్రమేనని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బుధవారం మెహిదీపట్నం సెయింట్ ఆన్స్ మహిళా కాలేజీలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగం నిర్వహించిన యూత్ పార్లమెంట్ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విద్యావంతులు, మేధావులు రాజకీయాల్లోకి వస్తేనే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని, అప్పుడే రాజకీయ ప్రక్షాళన జరుగుతుందని తెలిపారు.
మహిళా శక్తి ఎంతో గొప్పదని, మహిళలు ఓటు హక్కు వినియోగించుకోవడంతో పాటు రాజకీయాల్లోకి రావాలని కోరారు. ఈ సందర్భంగా కాలేజీ జర్నలిజం విభాగం రూపొందించిన న్యూస్ బులెటిన్‌ను ఆవిష్కరించారు. అనంతరం పోటీల్లో గెలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ప్రిన్సిపాల్ ఏ. విజయ రాణి, అధ్యాపకులు, విద్యార్థులు
పాల్గొన్నారు.
