విశాఖ ‘ఉక్కు’ కోసం కేఏ పాల్ సంచలన నిర్ణయం

విశాఖ ‘ఉక్కు’ కోసం కేఏ పాల్ సంచలన నిర్ణయం
  • విశాఖ ‘ఉక్కు’ కోసం దీక్ష చేయాలని నిర్ణయం
  • కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ మద్దతు

న్యూఢిల్లీ, వెలుగు: విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఆలోచనను కేంద్రం వెనక్కి తీసుకోవాలని ప్రజా శాంతి పార్టీ వ్యవస్థాపకుడు కే ఏ పాల్ డిమాండ్ చేశారు. కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా ఆదివారం నుంచి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని చెప్పారు. గురువారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో 26 కంపెనీలను కేంద్రం ప్రైవేట్ పరం చేయాలని చూస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ ప్రజలకు కావాల్సింది మోడీ పాలసీ కాదని, జన్ పాలసీ అని అన్నారు. అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన రైతు ఉద్యమానికి తాను మద్దతిస్తున్నానని తెలిపారు. కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ ఇతర నేతలు పాల్ దీక్షకు మద్దతిస్తున్నట్లు తెలిపారు.