బషీర్‌బాగ్, వెలుగు: నలుగురు బాల కార్మికులకు కాచిగూడ రైల్వే పోలీసులు విముక్తి కల్పించారు. బుధవారం కాచిగూడలో కర్నాటక సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ రైలులో పోలీసులు తనిఖీలు నిర్వహించారు.
నలుగురు బాల కార్మికులను అనుమానాస్పదంగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వీరిని మోండా మార్కెట్లోని అశ్విత చైల్డ్ హోమ్‌కు తరలించారు. వీరిని అక్రమంగా తీసుకువెళ్తున్న బిహార్ కు చెందిన చిడిగాడి(45), యూపీకి చెందిన మహ్మద్ రషీద్(26) , హుస్సేన్(27), జితేందర్ చౌదరి(20) ను అరెస్ట్ చేసినట్లు కాచిగూడ రైల్వే సీఐ ఎల్లప్ప తెలిపారు.
