కాగజ్ నగర్, వెలుగు: కాగజ్ నగర్ మున్సిపాలిటీలో పెండింగ్‌లో ఉన్న ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ డాక్టర్ అనిత, బీఆర్ఎస్ కౌన్సిలర్లు సోమవారం నిరసనకు దిగారు. సోమవారం మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ జరగ్గా బీఆర్ఎస్ కౌన్సిలర్లు ప్లకార్డులు ప్రదర్శిస్తూ హాజరయ్యారు.
కౌన్సిల్‌లో తీర్మానాలు చేసినా అమలుకు నోచుకోవడం లేదని ఆరోపించారు. మున్సిపాలిటీలోని సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేకుంటే పోరాటం కొనసాగిస్తామని వెల్లడించారు.
