కనెక్ట్ అయ్యే సినిమా ‘కాగితం పడవలు’

కనెక్ట్ అయ్యే సినిమా ‘కాగితం పడవలు’

వర్ధన్, కృష్ణప్రియ జంటగా ఎంజీఆర్ తుకారాం దర్శకత్వంలో కీర్తన నరేష్, టీఆర్ ప్రసాద్ రెడ్డి, వెంకట్రాజుల, గాయత్రమ్మ అంజనప్ప నిర్మిస్తున్న చిత్రం ‘కాగితం పడవలు’. సెప్టెంబర్ 18న  ఏషియన్ సురేష్ ఎంటర్‌‌టైన్‌‌మెంట్ ద్వారా థియేట్రికల్ రిలీజ్ అవుతోంది. ఆదివారం సాంగ్ లాంచ్ ఈవెంట్‌‌ను నిర్వహించారు.

ఈ సందర్భంగా  దర్శకుడు తుకారాం మాట్లాడుతూ ‘ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ప్రేమకథ ఉంటుంది. ఈ సినిమా చూస్తే  అందరికీ తమ  ప్రేమకథ  గుర్తుకొస్తుంది. తప్పకుండా ఎంజాయ్ చేస్తారు’ అని చెప్పాడు.

ఈ చిత్రంలో నటించడం చాలా హ్యాపీగా ఉందని, సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ హీరో హీరోయిన్ థ్యాంక్స్  చెప్పారు. ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యేలా ఈ చిత్రం ఉంటుందని నిర్మాతలు అన్నారు. టీమ్ అంతా పాల్గొన్నారు.