ఐదేళ్ల త‌ర్వాత కైలాస మాన‌స స‌రోవ‌ర యాత్ర స్టార్ట్​.. ఎలా వెళ్లాలంటే..

ఐదేళ్ల త‌ర్వాత  కైలాస మాన‌స స‌రోవ‌ర యాత్ర స్టార్ట్​.. ఎలా వెళ్లాలంటే..

కైలాస మానస సరోవర యాత్రను ఈ ఏడాది (2025) కేంద్ర ప్రభుత్వం తిరిగి ప్రారంభించనుంది. కరోనా తరువాత ఆగిపోయిన ఈ యాత్ర ఈఏడాది జూన్​ నుంచి ఆగస్టు వరకు ఉంటుందని కేంద్ర విదేశాంగ మంత్రత్వ శాఖ తెలిపింది.  ప్రతి బ్యాచ్​లో 50 మంది ఉండేలా   బ్యాచ్​ ల వరకుఉండే విధంగా ఏర్పాటుచేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.

హిందువులు పవిత్రంగా భావించే కైలాస పర్వతంలో పరమేశ్వరుడు నివసిస్తాడని నమ్ముతారు. ఈ ఏడాది ఈ యాత్రను రెండు మార్గాల ద్వారా నిర్వహిస్తామని  కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.  ఒకరూట్​ ​  ఉత్తరాఖండ్​ లోని లిపులేఖ్ పాస్ ద్వారా కాగా... మరొక రూట్​సిక్కింలోని  నాథులా పాస్ ద్వారా ప్రయాణించేందుకు ఏర్పాట్లు చేసింది.  లిపులేఖ్ పాస్ గుండా వెళితే.... ఒక్కొక్కరికి దాదాపు రూ.  1.74 లక్షలు ....  నాథులా పాస్ గుండా  ప్రతి వ్యక్తికి  రూ. 2.83 లక్షలు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. 

యాత్రికుల నుంచి దరఖాస్తుల స్వీకరణ కోసం కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ kmy.gov.in వెబ్‌సైట్‌ ప్రారంభించింది.కైలాస మానస సరోవర యాత్ర 24 రోజులు పడుతుంది.  గతంలో  ఈ యాత్ర 21 రోజులు ఉండేది. ఈ ఏడాది 24 రోజులు ఉంటుందని..  యాత్రకు వెళ్లేముందు ఫిట్​నెస్​ సర్టిణికెట్​ అవసరమని కేంద్ర ప్రభుత్వ అధికారులు తెలిపారు.  కైలాస మానస సరోవర యాత్రకు వెళ్లే భక్తులు ఢిల్లీలో ఆరోగ్య ధృవీకరణ పత్రం తీసుకోవాలని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.  ఆరోగ్య పరిక్షల కోసం ఢిల్లీలో మూడు రోజులు ఉండాలి. కైలాస మాసనసరోవర పర్యాటకులు ముందుగా వెబ్ సైట్​ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం మేరకు పర్యాటకులను ఎంపిక చేస్తామని  కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

హిందువుల‌తో పాటు బౌద్దులు, జైనుల‌కు కూడా ఈ యాత్ర ప‌విత్రమైంద‌ని విదేశాంగ శాఖ మంత్రి కీర్తి సింగ్ తెలిపారు. లిపులేక్ పాస్‌, నాథులా పాస్ మార్గంలో రోడ్లను కూడా నిర్మించార‌ని, దీని వ‌ల్ల వృద్ధ యాత్రికుల‌కు మేలు జ‌రుగుతుంద‌న్నారు.కైలాస మానస సరోవర యాత్ర కోసం 5 వేలకు పైగా  ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోగా... 750 మంది యాత్రికులను ఎంపిక చేశారు. కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ అధ్యక్షతన కంప్యూటరైజ్డ్ లాటరీ ప్రక్రియ ద్వారా ఈ యాత్రికులను ఎంపిక చేశారు. ఎంపికైన యాత్రికులకు వారి ఎంపిక గురించి SMS మరియు ఇమెయిల్ ద్వారా తెలియజేస్తారు.