- పీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ వ్యాఖ్య
హైదరాబాద్, వెలుగు: మూసీపై కేటీఆర్ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ లో ఏమాత్రం పసలేదని పీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ అన్నారు. శనివారం ఆయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. గొప్ప సంకల్పంతో సీఎం రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళనకు శ్రీకారం చుడితే ప్రతిపక్ష ఎమ్మెల్యేగా కేటీఆర్..సర్కార్ ను అభినందిస్తూ సహకరించాల్సిందిపోయి హిమాయత్ సాగర్ లో మూసీ బాధితులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుండని ఆరోపించారు.
మూసీ బాధితులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. మూసీ ప్రక్షాళన ద్వారా ప్రపంచ వ్యాప్తంగా రాష్ట్రానికి వచ్చే గుర్తింపుపై సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం స్వయంగా మేధావుల సమావేశంలో వివరించారని గుర్తు చేశారు. దీన్ని తప్పుగా ప్రచారం చేసేందుకు కేటీఆర్ హిమాయత్ సాగర్ లో సమావేశం పెట్టి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వడం..ప్రభుత్వ అభివృద్ధికి అడుగడుగునా అడ్డుతగలడమేనని చనగాని విమర్శించారు.
