దేశ నిర్మాణంలో యువత పాత్ర కీలకం

దేశ నిర్మాణంలో యువత పాత్ర కీలకం
  •     కాకా అంబేద్కర్ ఇనిస్టిట్యూషన్స్ కరస్పాండెంట్ సరోజావివేక్

ముషీరాబాద్, వెలుగు : విద్యార్థులు చదువులో రాణిస్తూ.. దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలని కాకా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఇనిస్టిట్యూషన్స్​ కరస్పాండెంట్ జి.సరోజ వివేక్ ఆకాంక్షించారు. శనివారం బాగ్ లింగంపల్లిలోని కాలేజీలో ఎంబీఏ స్టూడెంట్స్​ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఇనిస్టిట్యూషన్స్​జాయింట్ సెక్రటరీ పీవీ రమణ కుమార్ తో కలిసి సరోజావివేక్ పాల్గొని మాట్లాడారు.

విద్యతోనే కుటుంబం, రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందని, ఆ విషయాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు గ్రహించాలన్నారు. క్రమం తప్పకుండా తరగతులకు హాజరైనప్పుడే వారిలో సృజనాత్మకత, ఆలోచన శక్తి పెరుగుతుందన్నారు.

విద్యార్థులు చదువుతోపాటు అన్ని ఈవెంట్లలో పాల్గొనాలని సూచించారు. అంబేద్కర్​ఇనిస్టిట్యూషన్స్​కు న్యాక్ గుర్తింపు వచ్చిన విషయాన్ని స్టూడెంట్లతో పంచుకుని ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం స్టూడెంట్లు ఆటపాటలతో అదరగొట్టారు.