వరద బాధితులకు కాకా ఫౌండేషన్ సాయం

వరద బాధితులకు కాకా ఫౌండేషన్ సాయం

భారీ వర్షాలకు జగిత్యాల జిల్లా ధర్మపురిలోని గోదావరి పరిసర ప్రాంతాలన్నీ నీట మునిగాయి. మూడు నాలుగు రోజులుగా నీరు, ఆహారం లేక నానా అవస్థలు పడుతున్నారు. దీంతో బాధితులకు అండగా నిలిచింది కాకా ఫౌండేషన్. ఫౌండేషన్ ఆధ్వర్యంలో కుమ్మరివాడ, గంపల వాడ, బోయవాడలోని 500 మంది పేదలకు ఆహారం, తాగు నీరు అందజేశారు. పలుచోట్ల అన్నదానం చేసి పేదల ఆకలి తీర్చారు. తమ బాధల్ని ఏ ప్రజాప్రతినిధి కూడా పట్టించుకోలేదని, ఇటువంటి తరుణంలో  తమ ఆకలి తీర్చిన కాకా ఫౌండేషన్ కు ధన్యవాదాలు తెలిపారు.

పెద్దపల్లి జిల్లా ధర్మారంలోని దాసరివాడలోనూ వర్షానికి చాలా ఇళ్లు నీట మునిగాయి. ఇండ్లలోని సరుకులన్నీ తడిసి ముద్దయ్యాయి. దీంతో బాధితులకు కాకా ఫౌండేషన్ పేదలకు భరోసాగా నిలిచింది. 40 మంది వరద బాధితులకు వారానికి సరిపడా నిత్యావసర సరుకులను కాకా ఫౌండేషన్ ట్రస్ట్ సభ్యులు పంపిణీ చేశారు.

మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం పొన్నారంలో 40 మంది నిరుపేదలకు విశాక ట్రస్ట్ ద్వారా నిత్యావసరాలను వివేక్ యువసేన, బీజేపీ నేతలు పంపిణీ చేశారు. వర్షాలతో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న పేదలకు ఇరవై రోజులకు సరిపడా నిత్యవసర సరుకుల్ని అందజేశారు.