- తాము 20 మంది చేరుతున్నట్టు కాకోలీ ఘోష్ ప్రకటన
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ రెబెల్ ఎంపీలు 20 మంది ఎన్డీయే కూటమిలో చేరుతున్నట్టు ప్రకటించారు. తామంతా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో పని చేస్తామని రెబెల్ ఎంపీల నాయకురాలు కాకోలీ ఘోష్ దస్తీదార్ వెల్లడించారు. టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీకి ఒకప్పుడు అత్యంత నమ్మకస్తురాలిగా ఉన్న ఘోష్.. ఇటీవల తనతోపాటు టీఎంసీ నుంచి తిరుగుబాటు చేసిన రెబెల్ ఎంపీలతో కలిసి ఎన్‌సీపీఐ పార్టీలో చేరారు.
తాజాగా సోమవారం నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనుండగా.. ఆదివారం తాను ఎన్డీయేలో చేరుతున్నట్లు ఆమె ప్రకటించారు. తనతోపాటు లోక్‌సభలో ఎన్‌సీపీఐ కింద ప్రత్యేక పార్లమెంటరీ గ్రూపుగా ఏర్పడిన 20 మంది(టీఎంసీ రెబెల్) ఎంపీలు కూడా ఎన్డీయేలో చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నాయకత్వంలో ఎన్డీయే కూటమితో కలిసి పని చేస్తూ.. దేశ నిర్మాణ పనిలో భాగస్వాములయ్యేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
