రెండో ఏడాదే కాళేశ్వరానికి రెస్ట్.. ఇంకా స్టార్ట్ కాని మోటర్లు

రెండో ఏడాదే కాళేశ్వరానికి రెస్ట్.. ఇంకా స్టార్ట్ కాని మోటర్లు

వానాకాలం వచ్చి 50 రోజులైనా నడవని లిఫ్టులు
మోటార్లు, పంప్లన్నీ బంద్ పెట్టిన సర్కారు
పొంగుతున్న ప్రాణహిత, గోదావరికీ వరద
మేడిగడ్డ గేట్లు ఎత్తి నీరంతా కిందికి వదిలేస్తున్నరు
ఈ నెలలోనే 40టీఎంసీలకు పైగా సముద్రంలోకి
లిఫ్ట్ంగ్ కు సర్కారు ఆదేశాలు లేవంటున్న ఆఫీసర్లు
అక్టోబర్ దాటితే ప్రాణహితకు వరద తగ్గే చాన్స్
కొనసాగుతున్న మూడోటీఎంసీ పనులు

హైదరాబాద్, వెలుగు: సుమారు లక్ష కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం భారీ ఎత్తిపోతల ప్రాజెక్టు మోటార్లు.. ఈ సీజన్లో సైలెంట్ అయ్యాయి. ఈ ఏడాది వానాకాలం మొదలై 51 రోజులు గడుస్తున్నా గోదావరి నుంచి ఇప్పటివరకు ఒక్క టీఎంసీ నీటిని కూడా లిఫ్ట్ చేయలేదు. కన్నెపల్లి, అన్నారం, సుందిళ్ల పంప్ హౌస్ లన్నీంటా మోటార్లకు అనధికారికంగా విరామం ప్రకటించారు. నెల రోజులకుపైగా ప్రాణహితలో భారీగా వరద కొనసాగుతుంటే.. మేడిగడ్డ గేట్లు ఎత్తి నీటిని సముద్రం వైపు విడిచిపెడుతున్నారు. ఏటా 225 టీఎంసీల నీళ్లను లిఫ్ట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. రెండో ఏడాది నుంచే కాళేశ్వరం నీళ్లు అక్కర్లేదన్నట్లుగా వదిలేయటం గమనార్హం. నెల రోజులకు పైగా ప్రాణహితలో భారీగా వరద కొనసాగుతుంటే.. మేడిగడ్డ గేట్లు ఎత్తి నీటిని సముద్రం వైపు విడిచిపెడుతున్నారు. ప్రభుత్వం చెపుతున్న గోదావరి నీటి వినియోగపు భారీ లెక్కలకు రివర్స్ లో నీటిని వదిలేయడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నిరుడు కాళేశ్వరం ప్రారంభానికి హంగామా
చేసిన ఇరిగేషన్ డిపార్ట్ మెంట్.. ఈ ఏడాది సర్కారు ఆదేశాలు అందలేదని చేతులు ముడుచుకుంది.

వానాకాలం దాటిపోతే!
రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన టార్గెట్ ప్రకారం ఈ ప్రాజెక్టు ద్వారా ఏటా 225 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేయాలి. మేడిగడ్డ బ్యారేజీ వద్ద ఉన్న మొత్తం 85 గేట్లను మూసి చుక్క నీరూ కిందికి పోకుండా ఆపితే.. కన్నెపల్లి పంప్‌‌‌‌‌‌‌‌హౌస్ నుంచి రోజూ 11 మోటార్లను నిరంతరాయంగా 112 రోజులు నడిపితేనే ఈ టార్గెట్ పూర్తవుతుంది . ఇది వానాకాలంలోనే సాధ్యమవుతుంది. అక్టోబర్‌ నుంచి ప్రాణహితలో వరద పెద్దగా ఉండదు. ఎగువన కురుస్తున్న వానలతో ప్రస్తుతం ప్రాణహిత ఉప్పొంగి ప్రవహిస్తున్నా నీటిని వాడుకోలేని పరిస్థితి కనిపిస్తోంది. కన్నెపల్లి పంప్‌‌‌‌ ‌‌‌‌హౌస్‌‌‌‌ మోటార్లు స్టార్ట్‌‌‌‌ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రీన్‌‌‌‌‌‌‌‌సిగ్నల్‌‌‌‌‌‌‌‌ రాకపోవడంతో అధికారులు మేడిగడ్డ బ్యారేజీ గేట్లను ఎత్తి మరీ నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువన ఉన్న మహారాష్ట్ర నుంచి గోదావరి నది వరద కిందికి రావడం లేదు. అక్కడి ప్రాజెక్ట్‌‌‌‌లు నిండితే తప్ప వాళ్లు ఒక్క చుక్క నీటిని కూడా విడిచిపెట్టరు. దీంతో ఎల్లంపల్లి రిజర్వాయర్‌లో నీటి నిల్వలు తగ్గిపోయాయి. ఎస్సారెస్పీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా వరద
కాల్వను నీటితో నింపేందుకు.. ఎల్లంపల్లి అడుగంటేంత వరకు ఖాళీ చేసేందుకు ప్రభుత్వం డిసైడైన తీరు వివాదాస్పదమైంది. ఇప్పుడు మేడిగడ్డ వద్ద ఉన్న గోదావరి నీటి ఉధృతి ప్రకారం.. నీటిని లిఫ్ట్ చేసి కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌లో భాగంగా నిర్మించిన రిజర్వాయర్లన్నీ నింపుకునే వీలుంది. కానీ.. వానాకాలంలో సగం రోజులు ముగిసినా.. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవటం ఆశ్చర్యం కలిగిస్తోంది.

40 టీఎంసీలు సముద్రం పాలు
మోటార్లు ఆన్ చేయకపోవటంతో మూడు వారాల్లో సుమారు 40 టీఎంసీల గోదావరి నీళ్లు మేడిగడ్డ దాటి దిగువకు వృధాగా పోయాయి. గతేడాది జూన్‌‌‌‌‌‌‌‌21న సీఎం కేసీఆర్‌ కన్నెపల్లిలో మోటార్లను స్టార్ట్ ‌‌ చేసి నీటి పంపింగ్‌ ‌‌‌‌‌‌‌మొదలుపెట్టారు. అప్పుడు ప్రాణహితలో వరద లేకపోవడంతో గంట సేపటికే బంద్‌ చేశారు. ఆ తర్వాత జులై 6 నుంచి 29 వ‍రకు 5 మోటార్లను నిరంతరాయంగా నడిపించి 11.88 టీఎంసీలను అన్నారం(సరస్వతి) బ్యారేజీలోకి పంపింగ్‌‌‌‌‌‌‌‌చేశారు. ఈ ఏడాది జులై చివరి వారం వస్తున్నా మోటార్లు స్టార్ట్‌‌‌‌ చేయకుండా నీళ్లను వదిలేస్తున్నారు. ఈ నెల 16న ఒక్క రోజే అత్యధికంగా వరద రావటంతో 35 గేట్లు ఎత్తి 90 వేల క్యూసెక్కుల నీటిని వదలిపెట్టారు. ఈ నెలలోనే 5 లక్షల క్యూసెక్కుల వరద నీళ్లు సముద్రం వైపు తరలిపోయాయి. రోజుకు ప్రాణహిత నుంచి 30 వేల క్యూసెక్కులకు పైగా వరద వచ్చి చేరుతోంది. ఇన్ని నీళ్లు వస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు.

ఆగని మూడోటీఎంసీ పనులు
ఈ సీజన్లో నీటి లిఫ్టింగ్ అక్కర్లేదన్నట్లుగా వదిలేసిన రాష్ట్ర ప్రభుత్వం రూ.25 వేల కోట్లతో చేపట్టిన మూడో టీఎంసీ పనులు మాత్రం ఎప్పట్లాగే కొనసాగిస్తోంది. కన్నెపల్లి(లక్ష్మీ) పంప్‌‌‌‌‌‌‌‌హౌస్లో రోజుకు 2 టీఎంసీల నీటిని లిఫ్ట్‌‌‌‌చేసే మోటార్లు ఖాళీగా పడి ఉన్నాయి. వాటిని వాడకుండా మూడో టీఎంసీ నీటిని ఎత్తి పోసే మోటార్లు బిగించే పనులు స్పీడ్ గా పూర్తి చేస్తోంది. ఇప్పటికే రెండు మోటార్లు ఫిట్ చేసింది. మూడో మోటార్ పని కొనసాగుతోంది. మిగతా 11 మోటార్లు రెడీగా ఉన్నా.. ఆఫ్లోనే ఉంటున్నాయి.

For More News..

18 కోట్ల మందికి కరోనా వచ్చిపోయిందని కూడా తెలియదు

ఢిల్లీలో ప్రతి నలుగురిలో ఒకరికి కరోనా

ప్రపంచవ్యాప్తంగా జోరుగా వ్యాక్సిన్ ట్రయల్స్