రాజశేఖర్ ‘కల్కి’ : ఇంప్రెసివ్ టీజర్

రాజశేఖర్ ‘కల్కి’ : ఇంప్రెసివ్ టీజర్

‘గరుడ వేగ’తో ఆకట్టుకున్న యాంగ్రీ స్టార్ రాజశేఖర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ  కల్కి. 1983 బ్యాక్ డ్రాప్ లో క్రైమ్‌ థ్రిల్లర్‌ గా ఈ మూవీని రూపొందిస్తున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.  కల్కి టైటిల్ మోషన్ పోస్టర్, కల్కి ఫస్ట్ అవతార్, ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్,  రాజశేఖర్ బర్త్ డే సందర్భంగా ఓ టీజర్ ను రిలీజ్ చేసి.. ఇండస్ట్రీలో బజ్ క్రియేట్ చేసింది మూవీ యూనిట్. లేటెస్ట్ గా విడుదలైన ఫుల్ లెంగ్త్ టీజర్ … ప్రేక్షకులను మరింతగా ఇంప్రెస్ చేసేలా ఉంది.

కల్కి టైటిల్ మోషన్ పోస్టర్ లో చూపించిన ఆయుధాలు… మెటీరియల్ అంతా… కొత్త టీజర్ లో మరోసారి చూపించాడు డైరెక్టర్. దీంతోపాటు… మూవీలోని ప్రధాన పాత్రలను పరిచయం చేశారు. ఈ  క్రైమ్ థ్రిల్లర్, ఫాంటసీ మూవీపై అంచనాలను పెంచేసింది ఈ టీజర్. ముఖ్యంగా విజువల్స్, కెమెరా వర్క్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఖతర్నాక్ ఉన్నాయి.

నిర్మాత సి. కళ్యాణ్ తో కలిసి హీరో రాజశేఖర్ సొంత బ్యానర్ పై ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఆదాశర్మ, నందితా శ్వేత, స్కార్లెట్ మెల్లిష్ విల్సన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.