
స్విచ్ వేసిన 20 నిమిషాల్లో మొత్తం నీట మునిగింది
నాగర్ కర్నూలు: కృష్ణా నదిపై నిర్మించిన కల్వకుర్తి ఎత్తిపోతల పథకం మొదటి లిఫ్ట్ పంప్ హౌస్ నీట మునిగింది. మొదటి పంప్ హౌస్ స్విచ్ వేసిన కొద్దిసేపటికే నీటి సరఫరా మొదలైంది. రెండో స్విచ్ వేసిన 20 నిమిషాల్లో మొత్తం పంప్ హౌస్ నీట మునిగిపోయింది. తాగునీటి సరఫరా కోసం ఈ లిఫ్ట్ ను ఉపయోగించేందుకు ప్రయత్నించగా ఈ ఘటన జరిగింది. కొల్లాపూర్ మండలం ఎల్లూరు వద్ద నీట మునిగినట్లు తెలియడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. వెంటనే అధికారులు స్పందించి నష్ట నివారణ చర్యలు చేపట్టారు. ఉన్నతాధికారులు స్పందించి ఘటన ఎలా జరిగిందన్నది విచారిస్తున్నారు. విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు. ఎమ్మెల్యేలు మర్రిజనార్ధన్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం మొదటి లిఫ్ట్ పంప్ హౌస్ ను పరిశీలించారు. ప్రజలకు ఇబ్బందిలేకుండా రైతులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచనలిచ్చారు.