దంపతుల జీవితంలోకి మూడో వ్యక్తి ఎంట్రీ.. క్లీన్ ఫ్యామిలీ థ్రిల్లర్‌ 'కళ్యాణం కమనీయం జీవితం' ట్రైలర్ రిలీజ్!

దంపతుల జీవితంలోకి మూడో వ్యక్తి ఎంట్రీ.. క్లీన్ ఫ్యామిలీ థ్రిల్లర్‌ 'కళ్యాణం కమనీయం జీవితం' ట్రైలర్ రిలీజ్!

కొత్త కథలు, కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తూ తెరకెక్కుతున్న ఆసక్తికర చిత్రం 'కళ్యాణం కమనీయం జీవితం'. వి వి ఫై మీడియా ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై పైలా ప్రసాద రావు, కిషోర్ గుండాల సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు రవి లోకిరెడ్డి దర్శకత్వం వహించారు. ఖాన్ దురాని, సాహితీ అవంచ జంటగా నటించిన ఈ చిత్రం ట్రైలర్ ను లేటెస్ట్ గా రిలీజ్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో రాజవంశీ ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.

హైదరాబాద్‌లో జరిగిన ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్, నిర్మాతలు కేఎల్ దామోదర ప్రసాద్, ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొని చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ట్రైలర్ చూస్తే ప్రేమ, పెళ్లి, కుటుంబ అనుబంధాల చుట్టూ తిరిగే కథలోకి ఓ మూడో వ్యక్తి ఎంట్రీ ఇవ్వడంతో అసలు ట్విస్ట్ మొదలవుతుందని తెలుస్తోంది. ఆ వ్యక్తి కారణంగా దంపతుల జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి? తమ బంధాన్ని కాపాడుకోవడానికి వారు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? అనే అంశాలు సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి.

దర్శకుడు రవి లోకిరెడ్డి ఈ కథకు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ జోడించి యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా తెరకెక్కించినట్లు చిత్ర బృందం చెబుతోంది. ఎన్.సి. అరవింద్ ఏకలవ్య అందించిన కథ, శ్రీ మురళీ కార్తికేయ సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. పాటలతో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా హైలైట్‌గా నిలుస్తుందని మేకర్స్ చెబుతున్నారు. యువ టాలెంట్‌ను ఈ చిత్రంలో ప్రోత్సహించారని పలువురు కొనియాడారు. టెక్నీషియన్ నుంచి హీరోగా మారిన ఖాన్ దురాని, సాహితిల యాక్టింగ్, స్టార్ మేకర్ సత్యానంద్ కీలక పాత్ర సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుందన్నారు..

ALSO READ : బోల్డ్ అండ్ రొమాంటిక్ కు మరో లెవల్ ఇది..

ఒక జంట వైవాహిక జీవితంలోకి మూడో వ్యక్తి ప్రవేశిస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? వారి బంధం నిలిచిందా లేదా? అనే పాయింట్‌ను సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో డైరెక్టర్ అద్భుతంగా మలిచారని వి. వి వినాయక్. ప్రశంసించారు . ఎలాంటి అసభ్యతకు తావులేకుండా కుటుంబ సమేతంగా చూసే క్లీన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాని  రూపొందిన 'కళ్యాణం కమనీయం జీవితం' ఈ నెల 18న థియేటర్లలో సందడి చేయనుంది. మరి ప్రేక్షకులను ఈ మూవీ ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.