సూర్యకు రోలెక్స్ వాచ్ గిఫ్ట్ ఇచ్చిన కమల్

సూర్యకు రోలెక్స్ వాచ్ గిఫ్ట్ ఇచ్చిన కమల్

కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ ముఖ్య పాత్రల్లో నటించిన సినిమా విక్రమ్.  లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ మల్టీస్టారర్ సినిమాలో నటుడు సూర్య గెస్ట్ రోల్ లో కనిపించి.. ఈ మూవీ క్రేజ్ ను మరింత పెంచాడు. సూర్య కనిపించింది చివరి 3 నిమిషాలే అయినా.. మొత్తం మూవీకి మరో హైలెట్ గా నిలవడం చెప్పుకోదగిన విషయం. అయితే ఈ సినిమా ఇప్పటికే భారీ విజయాన్ని సాధించి 150 కోట్ల గ్రాస్ కలెక్షన్లని వసూలు చేసింది. 200 కోట్ల కలెక్షన్లకి దూసుకెళ్తూ సినిమా రోజు రోజుకి ఇమేజ్ ను సొంతం చేసుకుంటోంది. అయితే ఈ మూవీ ఇంత భారీ హిట్ అవ్వడానికి ముఖ్య కారణాల్లో ఒకటి సూర్య కూడా. మూవీలో ఆయన ఎంట్రీ చూసిన అభిమానులు... రచ్చ రచ్చ చేశారు. 

అయితే సూర్య చేసిన రోలెక్స్ క్యారెక్టర్ సినిమాకి బాగా ప్లస్ కావడంతో కమల్ హాసన్ స్వయంగా త్వరలో సూర్యతో సినిమా చేస్తున్నాను అని ప్రకటించాడు. చాలా రోజుల తరవాత భారీ సక్సెస్ అందుకున్న కమల్ హాసన్.. తాజాగా రోలెక్స్ క్యారెక్టర్ చేసిన సూర్యకి ఆయన బ్రాండ్ కి తగ్గట్టు రోలెక్స్ వాచ్ ని బహుమతిగా ఇచ్చారు. స్వయానా ఆయనే సూర్య చేతికి రోలెక్స్ వాచ్ ని తొడిగారు. ఇలా సూర్య ఒక్కడికే కాదు.. ఈ మూవీలో భాగస్వామ్యమైన పలువురికీ కమల్... పలు బహుమతులు ఇచ్చినట్టు సమాచారం. ఈ సందర్భంగా నటుడు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.. ఈ మూమెంట్ కు సంబంధించిన కొన్ని పిక్స్ ను షేర్ చేశాడు.