
వాషింగ్టన్: అమెరికా మాజీ వైస్ ప్రెసిడెంట్, డెమోక్రటిక్ లీడర్ కమలా హారిస్ వైర్డ్ హెడ్ ఫోన్స్ పెట్టుకొని చిల్ అవుతున్న ఫొటో ఒకటి వైరల్ అవుతున్నది. దీనిపై తాజాగా స్టిఫెన్ కోల్‌బర్ట్ నైట్ టాక్ షోలో కమల క్లారిటీ ఇచ్చారు. వైర్‌లెస్ టెక్నాలజీ ఉపయోగించకపోవడానికి కారణాన్ని వివరించారు. అధ్యక్ష ఎన్నికల్లో ఓడిన తర్వాత తొలిసారిగా కమల ఈ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకోవడానికి వైర్డ్ ఇయర్ ఫోన్ మాత్రమే ఉపయోగిస్తానని చెప్పారు.
‘‘నేను సెనేట్ ఇంటెలిజెన్స్ కమిటీలో పనిచేశా. ఆ టైంలో సెక్యూరిటీ ముఖ్యం. అలాగే, అధికారులతో సున్నితమైన సమాచారం పంచుకోవాల్సి ఉంటుంది. వైర్ లెస్ ఇయర్ ఫోన్స్‌తో మన మాటలు ఎవరైన వినే అవకాశం ఉంది. అందుకే వైర్డ్ హెడ్ ఫోన్స్ సురక్షితం అని నేను చెబుతాను” అని ఆమె వివరించారు. దీంతో కమల కామెంట్లు వైరల్ అవుతున్నాయి. అవును కమలా హారిస్ చెప్పింది నిజమేనని నెటిజన్లు అంటున్నారు.