
న్యూయార్క్: నిరుడు జరిగిన అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ఎండార్స్మెంట్ల కోసం మాజీ ప్రెసిడెంట్ కమలా హారిస్ పలువురు ప్రముఖ కళాకారులకు పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించారని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వడం ఇల్లీగల్ అని, తప్పు చేసినట్లు నిరూపితమైతే.. చట్టప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా వేదికైన ట్రూత్ పోస్ట్‌లో కోరారు. తమను బలపర్చేందుకు పొలిటికల్ లీడర్లు ఇలా ప్రజలకు డబ్బులు చెల్లించడం ప్రారంభిస్తే ప్రజాస్వామ్య వ్యవస్థ నాశనం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అసలు ఇది ఊహించలేమన్నారు. బియోన్స్, ఓప్రా, అల్ షార్ప్టన్లకు హారిస్ పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చారని ఆరోపించారు.