సదాశివనగర్ మండలం మర్కల్ శివారులో బస్సును ఢీకొన్న లారీ పలువురికి గాయాలు

సదాశివనగర్ మండలం మర్కల్ శివారులో బస్సును ఢీకొన్న లారీ పలువురికి గాయాలు

కామారెడ్డి, వెలుగు: సదాశివనగర్​ మండలం మర్కల్​ శివారులో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. కామారెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు నిజామాబాద్​ నుంచి కామారెడ్డికి వస్తుంది.

సదాశివనగర్​ మండలం మర్కల్​ శివారులోకి రాగానే వెనుక నుంచి లారీ బస్సును ఓవర్​ టెక్​ చేసే క్రమంలో రాసుకుంటూ వెళ్లింది. బస్సు స్వల్పంగా దెబ్బతినగా డ్రైవర్​ వైపు కూర్చున్న పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. వీరిని చికిత్స కోసం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.