
ఎల్బీ నగర్ : చిన్నపిల్లల కోసం కామినేని దవాఖానలో మంగళవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహిచనున్నా రు. న్యు మోనియా, జ్వరం, మూత్ర నాలాల సంబంధిత సమస్య లతో బాధపడే వారు ఈ శిబిరానికి రావొచ్చని , ఇక నుంచి ప్రతి మంగళవారం నిర్వహిస్తామని కామినేని దవాఖాన బ్రాండింగ్ మేనేజర్ వెంకట్ భరద్వాజ్ తెలిపారు. చెస్ట్ ఎక్స్‌రే , కంప్లీట్ బ్లడ్ పిక్చర్, కంప్లీట్ యూరిన్ ఎగ్జామ్, రాండమ్ బ్లడ్ షుగర్, సిరం ఎలక్ట్రోలైట్స్ , సిరం క్రియాటిన్, బ్లడ్ యూరియా, ఈఎస్ఆర్ లాంటి వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తామన్నా రు. డాక్టర్ కన్సల్టేషన్ కూడా ఉచితమేనని వివరిం చారు. ఫిట్స్, తలసీమియా లాంటి సమస్య లున్నవారు ఈ శిబిరాన్ని ఉపయోగించుకోవచ్చని తెలిపారు.