కంగనా రనౌత్ లీడ్ రోల్లో రూపొందిన చిత్రం ‘భారత్ భాగ్య విధాత’. మనోజ్ తపాడియా దర్శకత్వం వహించగా, కంగనకు చెందిన మణికర్ణిక ఫిల్మ్స్‌తో కలిసి పెన్ స్టూడియోస్, పరమహంస క్రియేషన్స్ సంస్థలు నిర్మించాయి. జూన్‌లో థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆగస్టు 14న ప్రత్యేక డిజిటల్ ప్రీమియర్‌గా హిందీ జీ5లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుందని మేకర్స్ అనౌన్స్ చేశారు.
దేశం కోసం అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించిన అజ్ఞాత వీరుల కథను ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతో జీ5 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్కు ప్రకటించామని అన్నారు. 26/11 ముంబై టెర్రర్ అటాక్ సమయంలో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ సమయంలో అపారమైన ధైర్యసాహసాలను ప్రదర్శించిన నర్సులు, వార్డ్ బాయ్స్, క్లీనర్స్, లిఫ్ట్ ఆపరేటర్లు, సెక్యూరిటీ సిబ్బంది లాంటి అన్సంగ్ హీరోస్‌కు నివాళిగా ఈ సినిమా ఉంటుంది. గిరిజా ఓక్, స్మితా తాంబే, అమృతా నామ్‌దేవ్, ఈషా డే, ప్రియా బెర్డే, ఆశా షేలార్ ఇతర పాత్రలు పోషించారు.
