కంగనా రనౌత్ ‘తలైవి’ రిలీజ్ డేట్ ఫిక్స్

 కంగనా రనౌత్ ‘తలైవి’ రిలీజ్ డేట్ ఫిక్స్

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితగాధ ఆధారంగా నిర్మించిన ‘తలైవి’ సినిమా థియేటర్లలో రిలీజ్ కు డేట్ ఫిక్స్ అయింది. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ జయలలితగా నటించిన సినిమాకు విష్ణు ఇందూరి నిర్మించగా..  ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించారు. మరో కీలకపాత్రలో అరవిందస్వామి నటించిన ఈ సినిమా షూటింగ్ పూర్తయి చాలా కాలం అయింది. అయితే కరోనా కారణంగా థియేటర్లు మూతపడడంతో రిలీజ్ కోసం నిర్మాతలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఒకదశలో ఓటీటీలో రిలీజ్ చేయాలని ఆలోచించినా వాయిదా పడింది. ఇప్పుడు పరిస్థితులు బాగుండడంతో వచ్చేనెల 10వ తేదీన థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. తలైవి ఐకానిక్ ధీశాలి కథని వెండితెరపైనే చూస్తే బాగుండాలని ఆశించినట్లు స్పష్టం చేసింది. అరవిందస్వామి ఎంజీఆర్ పాత్రలో నటించిన ఈ సినిమాపై తమిళనాట భారీ అంచనాలు ఉన్నాయి.