సింగర్ కనికా కపూర్ డిశ్చార్జ్

సింగర్ కనికా కపూర్ డిశ్చార్జ్

లక్నో: ప్రముఖ బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ కరోనా నుంచి కోలుకుంది. లక్నోలోని ఓ హాస్పిటల్లో ట్రీట్ మెంట్ పొందిన ఆమె సోమవారం డిశ్చార్జిఅయ్యింది. వరుసగా రెండు రిపోర్టులు నెగెటివ్ రావడంతో కనికను డిశ్చార్ చేజి శామని, అయితే ఆమె మరికొన్ని రోజులు ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉంటుందని ఆఫీసర్లు చెప్పారు. కనికకు మొత్తం ఆరుసా ర్లు కరోనా టెస్టులు చేశారు. మొదట నాలుగు సార్లు పాజిటివ్ నే రావడంతో ఆందోళన వ్యక్తమైంది. రెండు రోజుల క్రితం చేసిన ఒక టెస్టు, ఆదివారం సాయంత్రం చేసిన మరో టెస్టులోనూ నెగెటివ్ రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. లండన్ కు వెళ్లొచ్చి న తర్వాత 10 రోజులకు మార్చి 20న కనికకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఇంతలోనే ఆమె వివిధ కార్యక్రమాల్లో పాల్గొంది. ఆమె పాల్గొన్న ఈవెంట్లలో పాల్గొన్న చాలామంది ప్రముఖులు సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నారు. దీంతో కనికా కపూర్ పై విమర్శలు వెల్లువెత్తాయి. మరోవైపు ఆమె నిర్లక్ష్యంగా వ్యవహరించిందని లక్నో చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఫిర్యాదు మేరకు కనికపై పోలీసులు కేసు నమోదు చేశారు