రజినీకాంత్ 'కూలీ' సినిమాలోలేడీ విలన్గా మెప్పించింది కన్నడ హీరోయిన్ రచితా రామ్, పాజిటివ్గా కనిపిస్తూ నెగెటివ్ షేడ్స్ చూపించే పాత్రతో సర్ప్రైజ్ చేసిందామె. దీంతో అప్పటివరకూ కన్నడలో పాపులర్ అయిన రచితా.. 'కూలీ' తర్వాత తెలుగు, తమిళ భాషల్లోనూ చక్కని గుర్తింపును అందుకుంది. తాజాగా టాలీవుడ్లోరీఎంట్రీకి రెడీ అవుతోంది. చిరంజీవి సినిమాలో నటించే ఛాన్స్ అందు కుందామె.
చిరంజీవి హీరోగా బాబీ డైరెక్షన్లో ఓ సినిమా రూపొందు తున్న విషయం తెలిసిందే. ఇందులో ఓ కీలకపాత్ర కోసం రచితా రాము ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. 'కూలీ' తరహాలోనే డిఫరెంట్ షేడ్స్లో ఈ క్యారెక్టర్ ఉండనుందట. తొలుత ఈ పాత్ర కోసం మలయాళ హీరోయిన్ హనీ రోజ్ను అనుకున్నప్పటికీ ఆమె డేట్స్ క్లాష్తో తప్పుకుంది.
ఆ స్థానంలో రచితా రామ్ను ఫైనల్ చేశారు. త్వరలోనే మూవీ సెట్స్లో లో ఆమె జాయిన్ కానుంది. నాలుగేళ్ల క్రితం కళ్యాణ్ దేవ్ హీరోగా వచ్చిన 'సూపర్ మచ్చి' సినిమాతో రచితా రామ్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా డిజాస్టర్ అవడంతో ఆ తర్వాత తెలుగులో ఆమెకు అవకాశాలు రాలేదు. మళ్లీ ఇన్నేళ్లకు చిరంజీవి సినిమాతో రీఎంట్రీ ఇస్తోంది.
And it begins ❤️🔥
— Bobby (@dirbobby) May 22, 2026
The journey of #Mega158 begins today with unstoppable energy and the spirit to set THE BLOODY BENCHMARK 🔥https://t.co/oxPLGsBawZ
Beyond excited to collaborate once again with my hero, Megastar @KChiruTweets garu for #ChiruBobby2, and proudly welcoming… pic.twitter.com/rHBIbxDNGp
