సుశాంత్, సారా విడిపోవడానికి కరీనానే కారణం: కంగనా

సుశాంత్, సారా విడిపోవడానికి కరీనానే కారణం: కంగనా

బాలీవుడ్ నటి కరీనా కపూర్ పై నటి కంగనా రనౌత్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గురించి కంగన ఓ మీడియాతో మాట్లాడుతూ… సుశాంత్, సారా అలీఖాన్ (సైఫ్ అలీ ఖాన్ కూతురు) ఇద్దరూ ప్రేమలో ఉన్నారని తెలిపింది. అంతేకాదు వారిద్దరూ విడిపోవడానికి కరీనానే కారణమన్నారు. తన తొలి హీరో సుశాంత్ తో డేటింగ్ చేయవద్దని ఆమె సవతి తల్లి కరీనా కోరిందని చెప్పారు. మీడియా కూడా కరీనాకు సహకరించిందని తెలిపారు. మీడియా, బీటౌన్ ఇద్దరూ కలిసి సుశాంత్, సారా విడిపోయేలా చేశారని ఆరోపించింది. ఈ గ్యాంగ్ తనను కూడా టార్గెట్ చేయడానికి యత్నించిందని చెప్పింది కంగనా.