కరీంనగర్ టౌన్/జగిత్యాల టౌన్,వెలుగు: ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని, శాఖల వారీగా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కరీంనగర్ కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ ప్రజల నుంచి 352 దరఖాస్తులు స్వీకరించారు. ప్రజావాణిలో వృద్ధులు, దివ్యాంగులు కూర్చున్న చోటకే వెళ్లి కలెక్టర్ వారి నుంచిదరఖాస్తులు స్వీకరించారు.
కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్, ఆర్డిఓ మహేశ్వర్, తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ కార్పొరేషన్ ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన ప్రజావాణిలో కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ దరఖాస్తులు స్వీకరించారు. జగిత్యాల కలెక్టరేట్‌లో నిర్వహించిన గ్రీవెన్స్‌లో అడిషనల్ కలెక్టర్ లత ప్రజల నుంచి 56 ఫిర్యాదులు స్వీకరించారు.
