ప్రభుత్వం ప్రతి గింజను కొంటుంది : కరీం నగర్ కలెక్టర్ చిత్రా మిశ్రా

ప్రభుత్వం ప్రతి గింజను కొంటుంది :  కరీం నగర్ కలెక్టర్ చిత్రా మిశ్రా
  •     కరీంనగర్ కలెక్టర్ చిత్రా మిశ్రా

కరీంనగర్ టౌన్, వెలుగు: జిల్లాలో ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొంటుందని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టర్  చిత్రా మిశ్రా స్పష్టం చేశారు. శనివారం రాత్రి కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో అడిషనల్ కలెక్టర్ డి.శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌రెడ్డి, సివిల్ సప్లై ఆఫీసర్లతో రివ్యూ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. 

కొనుగోలు ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తూ, అధికారులు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు. అకాల వర్షాలకు ధాన్యం తడవకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో హుజూరాబాద్ ఆర్డీవో రమేశ్‌‌‌‌‌‌‌‌బాబు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.