- కరీంనగర్ కలెక్టర్ కలెక్టర్ చిత్రా మిశ్రా
చొప్పదండి, వెలుగు: ఎండల తీవ్రత పెరుగుతున్నందున గ్రామాల్లో ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టాలని కరీంనగర్ కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. మంగళవారం చొప్పదండి మండలం గుమ్లాపూర్, మల్లన్నపల్లి గ్రామాల్లోని మంచినీటి బావులను అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలో తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. పైప్‌లైన్లలో ఎక్కడైనా లీకేజీలు ఉన్నట్లయితే వెంటనే రిపేర్లు చేపట్టాలన్నారు.
అనంతరం చొప్పదండిలోని ఎస్సీ సంక్షేమ శాఖ వసతి గృహాన్ని తనిఖీ చేశారు. వంటగది, మరుగుదొడ్లు, డార్మటరీ హాల్, భోజనశాల పరిశీలించారు. బాయ్స్ హైస్కూల్‌లో ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లకు ఏర్పాటు చేసిన మొదటి విడత శిక్షణను కలెక్టర్ పరిశీలించారు. కార్యక్రమంలో డీపీవో జగదీశ్వర్, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ శ్రీనివాస్, డీఈ వినయ్, కాట్నపల్లి సర్పంచ్ గన్ను శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

