గ్రీవెన్స్ ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి : కరీంనగర్ ‌‌ ‌‌ కలెక్టర్ చిత్రా మిశ్రా

గ్రీవెన్స్ ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి :  కరీంనగర్ ‌‌ ‌‌ కలెక్టర్ చిత్రా మిశ్రా
  • కరీంనగర్ ‌‌ ‌‌కలెక్టర్ చిత్రా మిశ్రా

కరీంనగర్ టౌన్, వెలుగు: గ్రీవెన్స్ ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని కరీంనగర్ కలెక్టర్ ‌‌ ‌‌ చిత్రా మిశ్రా అన్నారు. సోమవారం కలెక్టరేట్ ‌‌లో జరిగిన ప్రజావాణిలో కలెక్టర్ 225 దరఖాస్తులను స్వీకరించారు. ఫిర్యాదుదారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకుని ఆయా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులు ఆదేశించారు. 

సార్​ నాకు చదువుకోవాలని ఉంది గ్రీవెన్స్​లో 7వ తరగతి బాలిక అర్జీ 

జగిత్యాల టౌన్, వెలుగు: ‘సార్​ నాకు చదువుకోవాలని ఉంది..’ అంటూ ఓ 7వ తరగతి స్టూడెంట్‌ గ్రీవెన్స్‌లో కలెక్టర్‌‌ సత్యప్రసాద్‌ను వేడుకుంది. సోమవారం జగిత్యాల కలెక్టరేట్‌లో ప్రజావాణి నిర్వహించారు. జగిత్యాల పట్టణానికి చెందిన గ్రీష్మ అనే విద్యార్థి గతంలో పురాణిపేట స్కూల్​లో చదివేది. వారికి నూకపల్లిలో డబుల్​ బెడ్రూం ఇల్లు రావడంతో అక్కడికి షిఫ్ట్​ అయ్యారు. దీంతో స్కూల్​ దూరమైంది. దీనికి తోడు గ్రీష్మ తల్లికి అనారోగ్యంగా ఉండడంతో ఇంటి బాధ్యతల వల్ల దూరంగా ఉన్న స్కూల్‌కు సరిగా వెళ్లలేకపోయింది. 

ఈక్రమంలో ధరూర్​ లోని స్కూల్​కు వెళ్తుండగా పాత స్కూల్​ నుంచి టీసీ రావడంతో ఆలస్యం కావడంతో కొత్త స్కూల్​లో చేర్చుకోలేదు. దీంతో పరీక్షలు దగ్గరపడుతుండగా తనకు చదువుకునే అవకాశం కల్పించాలని గ్రీష్మ కలెక్టర్‌‌ను కోరింది. స్పందించిన ఆయన విచారణ చేయాలని డీఈవో రామును ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి 74 అర్జీలు వచ్చినట్లు కలెక్టర్‌‌ తెలిపారు.