గంగాధర వెలుగు: మూడు రోజుల్లో మిషన్ మోడ్‌లో వడ్ల తరలింపు పూర్తిచేయాలని కరీంనగర్ కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. గంగాధర మార్కెట్ యార్డ్, మధురానగర్‌లో ధాన్యం కొనుగోలు ప్రక్రియను గురువారం రాత్రి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సీపీ గౌష్ ఆలంతో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎమ్మెల్యే రైతులతో మాట్లాడి కొనుగోళ్ల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
డెడ్‌లైన్ ప్రకారం ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా చేపట్టాలని సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని మూడు రోజుల్లోగా మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చొప్పదండి, గంగాధర, రామడుగు మండలాల్లో ధాన్యం కొనుగోళ్లు మరింత వేగవంతం చేయాలని ఎమ్మెల్యే సత్యం కలెక్టర్‌ను కోరారు. ఆర్డీవో కె.మహేశ్వర్, సివిల్ సప్లై అధికారి నర్సింగరావు, డీఎం రజినీకాంత్ పాల్గొన్నారు.
కోనరావుపేట,వెలుగు; ధాన్యం కొనుగోల ప్రక్రియను వేగవంతం చేసి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని రాజన్నసిరిసిల్ల ఎస్పీ మహేశ్ బి.గితే అధికారులను ఆదేశించారు. కోనరావుపేట మండలం ధర్మారం గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం కనగర్తి శివారులోని రైస్ మిల్లులను పరిశీలించి ధాన్యం అన్‌లోడింగ్‌లో జాప్యం చేయొద్దన్నారు. తర్వాత మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. సీఐ రవీందర్, ఎస్సై ప్రశాంత్ రెడ్డి,సిబ్బంది ఉన్నారు.
కోరుట్ల, వెలుగు: వడ్ల కొనుగోలు, రవాణా, అన్‌లోడింగ్ ప్రక్రియను స్పీడప్ చేయాలని అడిషనల్ కలెక్టర్ బి.రాజ గౌడ్ అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం జోగిన్‌పల్లి గ్రామంలో మూడు రైస్ మిల్లులను సందర్శించారు.
