కరీంనగర్ టౌన్, వెలుగు: 2026–27 ఆర్థిక సంవత్సరంలో రూ.10 వేల కోట్ల వ్యాపార లక్ష్యాలను సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ చిత్రామిశ్రా పిలుపునిచ్చారు. శుక్రవారం సిటీలోని కేడీసీసీ బ్యాంకు సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2025–26 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు ఉద్యోగుల కృషిని ప్రశంసించి, ఆర్థిక పలితాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. వ్వవసాయ, గ్రామీణాభివృద్ది శాఖలు సమన్వయంతో జిల్లా అభివృద్దికి కృషి చేయాలన్నారు.
జిల్లాలోని ఉత్పత్తి సహకార సంఘాలు, స్వయం సహాయక సంఘాల అభివృద్దికి తోడ్పడాలని కోరారు. మాడల్ ఎఫ్పీవోఎస్ క్షేత్ర సందర్శనకు ఏర్పాటు చేయాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది పథకాలను అమలు చేసేందుకు కృషి చేయాలని సూచించారు. సీఈవో ఎన్.సత్యనారాయణరావు, జీఎంలు బొద్దుల శ్రీధర్, రియాజోద్దీన్ పాల్గొన్నారు.
