కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డీసీసీబీకి అవార్డు

కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డీసీసీబీకి అవార్డు

కరీంనగర్ టౌన్/చొప్పదండి, వెలుగు: సహకార రంగంలో జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన కరీంనగర్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ (కేడీసీసీబీ) ఉత్తమ అవార్డుకు ఎంపికయినట్లు బ్యాంకు ప్రెసిడెంట్ కొండూరు రవీందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు తెలిపారు. నాబార్డు వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు చేతులమీదుగా అవార్డు అందుకున్నారు. 

ఆయన వెంట సీఈఒ సత్యనారాయణరావు ఉన్నారు. ఇదే విభాగంలో చొప్పదండి పీఏసీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కూడా అవార్డు వచ్చింది. వ్యవసాయ శాఖ మంత్రి చేతులమీదుగా ప్యాక్స్​ అధ్యక్షుడు వెల్మ మల్లారెడ్డి అవార్డు అందుకున్నారు.