కల్వర్టును ఢీకొట్టిన కారు, ఒకరు మృతి..కరీంనగర్‌‌ జిల్లా తిమ్మాపూర్‌‌ మండలంలో ఘటన 

కల్వర్టును ఢీకొట్టిన కారు, ఒకరు మృతి..కరీంనగర్‌‌ జిల్లా తిమ్మాపూర్‌‌ మండలంలో ఘటన 

తిమ్మాపూర్, వెలుగు : థార్‌‌ వెహికల్‌‌ అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టడంతో ఓ యువకుడు చనిపోగా, మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదం కరీంనగర్‌‌ జిల్లా తిమ్మాపూర్‌‌ మండలం మహాత్మానగర్‌‌లోని రాజీవ్‌‌ రహదారిపై శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం బాషగూడకు చెందిన బడావత్‌‌ ప్రదీప్‌‌నాయక్‌‌ (24) తన స్నేహితులు నందిని, పవన్‌‌తో కలిసి గురువారం సాయంత్రం మంచిర్యాల  వెళ్లారు. శుక్రవారం ఉదయం మంచిర్యాల నుంచి తిరుగుపయనం అయ్యారు. ఈ క్రమంలో మహాత్మానగర్‌‌కు చేరుకోగానే థార్‌‌ అదుపుతప్పి రోడ్డు పక్కనున్న కల్వర్టును ఢీకొట్టింది. ప్రమాదంలో ప్రదీప్‌‌నాయక్‌‌ అక్కడికక్కడే చనిపోగా.. పవన్, నందిని తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు గాయపడినవారిని హైదరాబాద్‌‌లోని హాస్పిటల్‌‌కు తరలించారు. మృతుడి తండ్రి శ్రీనివాస్‌‌ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ​