మార్చి 29 లోపు ఎన్నికల వ్యయాలు సమర్పించాలి : మున్సి పల్ కమిష నర్ ప్రపుల్ దేశాయ్

మార్చి  29 లోపు  ఎన్నికల వ్యయాలు సమర్పించాలి : మున్సి పల్  కమిష నర్ ప్రపుల్  దేశాయ్

కరీంనగర్ టౌన్,వెలుగు: కరీంనగర్ నగరపాలక సంస్థ,2వ సాధారణ  ఎన్నికలు  2026లో  పోటీ చేసిన  అభ్యర్థులు 29 లోపు ఎన్నికల   ఖర్చు  లెక్కలను  సమర్పించాలని బుధవారం  మున్సిపల్  కమిషనర్ ప్రపుల్  దేశాయ్  ఒక ప్రకటనలో తెలిపారు.  

తెలంగాణ స్టేట్  ఎలక్షన్  కమిషన్ హైదరాబాద్, జిల్లా ఎన్నికల  అధికారి, కరీంనగర్  కలెక్టర్ ఉత్తర్వుల మేరకు  పోటీచేసిన అభ్యర్థులందరు  తమ ఎన్నికల వ్యయలెక్కలను, ఎన్నికల  ఫలితాలు  వెలువడిన తేదీ నుంచి 45రోజుల్లో సమర్పించాలని పేర్కొన్నారు.