V6 News

కరీంనగర్ పాస్‌‌పోర్ట్ ఆఫీసులో అపాయింట్‌‌మెంట్ల పెంపు

కరీంనగర్ పాస్‌‌పోర్ట్ ఆఫీసులో అపాయింట్‌‌మెంట్ల పెంపు

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ పాస్‌‌పోర్ట్ సేవా కేంద్రంలో పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకుని రోజువారీ అపాయింట్‌‌మెంట్ల సామర్థ్యం 220 నుంచి 400కు పెంచుతూ రీజినల్ పాస్ పోర్ట్ ఆఫీసర్ జె.స్నేహజ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల పాస్ పోర్ట్ ఆఫీసుకు అప్లికేషన్లు పెరిగిన నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ చేసిన సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. 

ఈ నిర్ణయం మే 4 నుంచి అమల్లోకి రానుంది. మే 9న ప్రత్యేకంగా నిర్వహించే పాస్‌‌పోర్ట్ మేళాలో హైదరాబాద్ రీజినల్ పాస్ పోర్ట్ ఆఫీసు పరిధిలోని ఐదు పాస్‌‌పోర్ట్ సేవా కేంద్రాల్లో(పీఎస్ కే) 4,000 జనరల్ అపాయింట్‌‌మెంట్లు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.