కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రంలో 'అనలాగ్ పనీర్' అంటే ఆర్టిఫిషియల్ లేదా నాన్-డైరీ పనీర్ తయారు చేయడం, అమ్మడం, రవాణా చేయడం సహా వాడటంపై ఒక సంవత్సరం పాటు పూర్తిగా నిషేధం విధించింది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, ఈ విషయంపై ఆగస్టు 17న ప్రభుత్వం అధికారిక ఆదేశాలు జారీ చేసింది.
ఈ నిర్ణయానికి సంబంధించిన ముఖ్యాంశాలు:
నిజమైన పనీర్ అంటే ఏమిటి : స్వచ్ఛమైన పాలు, పాల కొవ్వుతో చేసేదాన్నే అసలైన పనీర్ అంటారు.
అనలాగ్ పనీర్ అంటే : పాల కొవ్వుకు బదులుగా వెజిటబుల్ ఆయిల్ (కూరగాయల నూనె), వెజిటబుల్ ఫ్యాట్ లేదా ఇతర పాలు కాని పదార్థాలు కలిపి చేసేదాన్ని అనలాగ్ లేదా నాన్-డైరీ పనీర్ అంటారు.
నిషేధం దేనికి వర్తిస్తుంది : FSSAI (భారత ఆహార భద్రతా సంస్థ) నాణ్యతా ప్రమాణాలు లేని అనలాగ్ పనీర్ రకాలకు మాత్రమే ఈ నిషేధం వర్తిస్తుంది.
ALSO READ : వర్షాకాలంలో కిడ్నీ, యూరినరీ సమస్యలు..
నియమాలు: హోటళ్లు, రెస్టారెంట్లు, వ్యాపారులు ఎవరూ కూడా ఈ అనలాగ్ పనీర్‌ను వంటల్లో వాడకూడదు, నిల్వ చేయకూడదు, విక్రయించకూడదు.
బెంగళూరు ఫుడ్ సేఫ్టీ కమిషనర్ కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం, సేకరించిన పనీర్ శాంపిల్స్‌లో ఎలాంటి ప్రమాదకరమైన కల్తీ జరగలేదు. అయితే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటానికి, నాణ్యతా ప్రమాణాలు లేని నకిలీ పనీర్ వాడకాన్ని అరికట్టడానికే ప్రభుత్వం ముందుజాగ్రత్త ఈ చర్య తీసుకుంది.
