బీఆర్ఎస్ పాలనలో పదేళ్లు కార్మికులకు కనీస వేతనాలు లేవు: మంత్రి వివేక్ వెంకటస్వామి

బీఆర్ఎస్ పాలనలో పదేళ్లు కార్మికులకు కనీస వేతనాలు లేవు: మంత్రి వివేక్ వెంకటస్వామి

బీఆర్ఎస్ హయాంలో పదేళ్ళపాటు కార్మికులకు కనీస వేతనాలు కూడా లేవని అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. శనివారం ( ఆగస్టు 22 )  గ్యాస్ డెలివరీ యూనియన్ 6వ మహాసభలో మాట్లాడుతూ బీఆర్ఎస్ పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు మంత్రి వివేక్. పాలిటెక్నిక్ విద్యార్థులకు, టీచర్లకు మేలు చేసే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంటే.. బీఆర్ఎస్ నేతలు విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. పాలిటెక్నిక్ డిపార్ట్మెంట్ అభివృద్ధికి రూ.600 కోట్లు ఇచ్చామని అన్నారు మంత్రి వివేక్.

లేబర్ మినిస్ట్రీ తనకు గొప్ప అవకాశమని... మా నాన్న చేసిన శాఖ చూడటం నా అదృష్టమని అన్నారు మంత్రి వివేక్. రూ.4వేల కోట్ల రూపాయలతో ATC లు నిర్మించామని అన్నారు. విద్యార్థులకు, టీచర్లకు మేలు చేయాలన్న ఉద్దేశంతోనే టెక్నికల్ డిపార్ట్మెంట్ ని కార్మిక శాఖకు బదిలీ చేశారని.. విద్యార్థులకు మంచి ఉద్యోగాలు రావాలన్నదే మా ఆలోచన అని స్పష్టం చేశారు మంత్రి వివేక్.

టీచర్స్ టెక్నీకల్ డిపార్ట్మెంట్ లోనే ఉంటారని.. ఆందోళన చెందొద్దని అన్నారు. ప్రజాపాలన అధికారంలోకి రాగానే కనీస వేతనాలు గురుంచి సీఎం తో మాట్లాడానని... కార్మికులు బాగుంటేనే ఇండస్ట్రీలు బావుంటాయని అన్నారు. కార్మికులకు ఉన్న అన్ని సమస్యలు తీర్చడానికి తన వంతు బాధ్యత కచ్చితంగా నిర్వహిస్తానని అన్నారు.

ALSO READ : కార్మికులకు అండగా ఉంటాం: మంత్రి వివేక్

40 వేల గ్యాస్ డెలివరీ వర్కర్స్ కు కనీస వేతనాలు కచ్చితంగా అమలు చేస్తామని.. ఇందుకోసం జీవో 6 విడుదల చేశామని అన్నారు మంత్రి వివేక్. PF లాంటి సమస్యలు కూడా త్వరలో తీర్చుతామని.. మన రాష్ట్రంలో గిగ్ వర్కర్స్  సంక్షేమం యాక్ట్ తీసుకొచ్చామని అన్నారు మంత్రి వివేక్.