కార్తీక మాసం ఎఫెక్ట్ తో తగ్గిన చికెన్ డిమాండ్

కార్తీక మాసం ఎఫెక్ట్ తో తగ్గిన చికెన్ డిమాండ్

ముక్కలేనిదే ముద్ద దిగదంటారు నాన్ వెజ్ ప్రియులు. ధర ఎంతైనా వారానికి ఒకసారైనా లాగిస్తారు. కానీ కార్తీక మాసం ఎఫెక్ట్ తో చికెన్ డిమాండ్ భారీగా తగ్గిపోయింది. దీంతో ఎప్పుడూ బిజీగా ఉండే చికెన్ సెంటర్స్ పబ్లిక్ లేక బోసి పోయి కనిపిస్తున్నాయి.వ్యాపారులు బిజినెస్ లేక ఇబ్బంది పడుతున్నారు.

కార్తీక మాసం ఎఫెక్ట్

హైదరాబాద్ మెనూలో నాన్ వెజ్  కంపల్సరీ. చికెట్, మటన్, ఫిష్ ఏదీ లేకపోతే లాస్ట్ కు ఎగ్ అయినా మస్ట్ గా మెనూలో ఉంటుంది. ధర ఎంతైనా వారానికి ఒకటి రెండు సార్లు తప్పుకుండా లాగిస్తారు. మాంసాహారం వాడకంలో దేశంలోనే తెలంగాణ టాప్ ప్లేస్ లో ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. కానీ కార్తీక మాసం ఎఫెక్ట్ తో నగరంలో నాన్ వెజ్ సేల్స్ బాగా తగ్గాయి. ధరలు తక్కువగా ఉన్నా కస్టమర్లు రావడం లేదని వ్యాపారులు వాపోతున్నారు.

భారీగా తగ్గిన నాన్ వెజ్ డిమాండ్

ఏటా కార్తీక మాసంలో నాన్ వెజ్ ధరలు తక్కువగా ఉంటాయి. శివారాధన చేసే చాలా మంది భక్తులు ఈ నెల రోజుల పాటు నాన్ వెజ్ ముట్టరు. దీంతో సిటీలోని చికెన్, మటన్ షాపులు కస్టమర్లు రాక బోసిపోయి కనిపిస్తున్నాయి. మరోవైపు కార్తీక మాసంలో చాలా మంది భక్తులు అయ్యప్ప మాల వేసుకుంటారు. ఇంట్లో ఒకరు దీక్షలో ఉన్నా.. పూర్తి కుటుంబం నాన్ వెజ్ కి దూరంగా ఉంటుంది. దీంతో బిజినెస్ పెద్దగా లేదని వ్యాపారులు చెబుతున్నారు. 

కస్టమర్లు రావడం లేదు

గతంలో రేట్ తగ్గితే అరకిలో కొనేవారు కిలో కొనేవాళ్లుని.. కానీ ఇప్పుడు అలాంటి కస్టమర్లు రావడం లేదని వ్యాపారులు అంటున్నారు. ప్రస్తుతం మార్కెట్ లో కేజీ చికెన్ 210 నుంచి 240 రూపాయలు వరకూ ఉందంటున్నారు. తమకు కూడా పెద్దగా వ్యాపారం లేదంటున్నారు.. హోటల్, రెస్టారెంట్ నిర్వాహకులు. నాన్ వెజ్ ఐటమ్స్ ఎన్ని రకాలున్నా.. చాలా మంది పబ్లిక్ వాటిని టచ్ చేయట్లేదని హోటల్స్ వ్యాపారులు చెబుతున్నారు. కనీసం వెజ్ లో వెరైటీ వంటకాలు చేద్దామంటే కూరగాయల ధరలు మండిపోతున్నాయంటున్నారు. 

చికెన్ తో పాటు మటన్, సీఫుడ్ పరిస్థితి కూడా ఈ విధంగానే ఉంది. హైదరాబాద్ లో నిత్యం వేల క్వింటాళ్ల మాంసం వినియోగం జరుగుతుంది. కానీ కార్తీక మాసంలో తినేవారి సంఖ్య తగ్గడంతో.. గతంలో 50 కేజీలు అమ్మే వాళ్ళు కూడా.. ప్రస్తుతం 10 నుంచి 15 కేజీలు మాత్రమే అమ్ముతున్నామని చెబుతున్నారు.