రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన.. అర్చకుల బృందానికి.. 86ఏళ్ల పండితుడు నాయకత్వం

రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన.. అర్చకుల బృందానికి.. 86ఏళ్ల పండితుడు నాయకత్వం

జనవరి 22న అయోధ్యలోని రామ మందిరంలో జరగనున్న రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా అర్చకుల బృందానికి వారణాసికి చెందిన 86 ఏళ్ల వేద కర్మకాండ్ (ఆచారాలు) పండితుడు, పండిట్ లక్ష్మీకాంత్ మధురనాథ్ దీక్షిత్ నాయకత్వం వహించనున్నారు. ఛత్రపతి శివాజీ పట్టాభిషేకానికి అధ్యక్షత వహించిన ఆయన 17వ శతాబ్దపు కాశీ పండితుడు.

జనవరి 16 నుంచి 22మధ్య విగ్రహ ప్రతిష్టాపన ఆచారాలను నిర్వహించేందుకు కాశీ నుంచి 40మందికి పైగా దేశమంతటా అన్ని వేదాల శాఖలకు చెందిన 121మంది పండితుల బృందానికి పండిట్ లక్ష్మీకాంత్ నాయకత్వం వహిస్తారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. రామ్ లల్లా పవిత్రోత్సవాన్ని పర్యవేక్షించే బాధ్యత తమకు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. రాముడి ఆశీర్వాదంతో తన విధులను నిర్వహిస్తానని చెప్పారు.

బాల రూపాన్ని వర్ణించే రాముడి విగ్రహం 90శాతం ఇప్పటికే సిద్దం కాగా.. ఈ విగ్రహాన్ని రామాలయంలోని గర్భగుడిలో ప్రతిష్టించనున్నారు. కర్ణాటక, రాజస్తాన్ నుంచి తెప్పించిన రాళ్లలో తయారు చేసిన విగ్రహాల తయారీ పని మరో వారంలో పూర్తి కానుంది. గర్భగుడితో సహా ఆలయంలోని గ్రౌండ్ ఫ్లోర్ దాదాపు సిద్దమైంది. రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ కోసం జనవరి 16న ఆచారాలు ప్రారంభం కానుండగా.. వేద పూజారి లక్ష్మీకాంత్ దీక్షిత్ జనవరి 22న ప్రధాన ఆచారాలను నిర్వహిస్తారు.