కనుల పండువగా కట్ట మైసమ్మ జాతర

కనుల పండువగా కట్ట మైసమ్మ జాతర

జీడిమెట్ల, వెలుగు :  సూరారం  కట్టమైసమ్మ అమ్మవారి జాతర ఉత్సవాలు వైభవంగా కొనసాగుతుండగా.. సోమవారం రంగం కార్యక్రమం జరిగింది. అమ్మవారు పూనిన వ్యక్తి భవిష్యవాణి వినిపించాడు. ఈ ఏడాది వర్షాలు అంతంత మాత్రంగా కురిసినా ప్రజలందరినీ కడుపులో పెట్టుకుని కాపాడుకుంటానని అమ్మవారు దీవించారు. సూరారంలో గాలిపోచమ్మ దేవాలయం నిర్మించాలని అమ్మవారు కోరారు. ప్రజలను రెచ్చగొట్టి సమాజంలో అశాంతిని పెంచే వారిని, అవినీతి అక్రమాలకు పాల్పడే వారికి శిక్షలు తప్పవని, అమాయకులకు అండ గా ఉంటూ లోక రక్షణ చేస్తానని చెప్పారు. సాయంత్రం ఫలహారం బండి ఊరేగింపు డప్పుచప్పుళ్లు , పోతరాజుల విన్యాసాల మధ్య కనుల పండువగా సాగింది.  బుధవారం అన్నప్రసాదంతో జాతర ఉత్సవాలు ముగుస్తాయి.