- తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రశ్న
హైదరాబాద్, వెలుగు: పోలీస్ కస్టడీలో మరణించిన దళిత యువకుడు కర్ల రాజేశ్ తల్లిగోడు రాహుల్ గాంధీకి ఎందుకు కనిపించడం లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణలో దళితులపై జరుగుతున్న దాష్టీకాలపై దృష్టి సారించాలని ఆదివారం ఆమె ‘ఎక్స్’లో పోస్ట్ పెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేండ్లు గడిచిందని, రోహిత్ వేముల చట్టం తీసుకురావడానికి ఇంకా ఎంతకాలం పడుతుందని నిలదీశారు.
దళితులపై ప్రేమ మాటల్లో కాదు చేతల్లో చూపాలని తెలిపారు. రోహిత్ వేముల చట్టం వెంటనే తీసుకురావాలని డిమాండ్ చేశారు. కర్ల రాజేశ్ కుటుంబాన్ని ఆదుకొని న్యాయం చేయాలని కోరారు. రాజేశ్ లాకప్ డెత్‌కు కారణమైన ఎస్ఐపై వెంటనే చర్యలు తీసుకునేలా సీఎం రేవంత్‌కు తగిన సూచనలు ఇవ్వాలన్నారు.
